రూ.50లక్షల కోట్లతో రైల్వే అభివృద్ధి : నిర్మల సీతారామన్

రూ.50లక్షల కోట్లతో రైల్వే అభివృద్ధి : నిర్మల సీతారామన్

దేశంలోని రోడ్లు, రైల్వే వ్యవస్థలను మరింతగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. నిర్మాణాత్మకంగా జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్మాణం జరుగుతోందని చెప్పారామె. అవసరాలను సరిపోయేలా.. నేషనల్ హైవే గ్రిడ్ ఏర్పాటయ్యేంతవరకు ఈ ప్రోగ్రామ్ కొనసాగుతుందన్నారు.

రైల్వేలను మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు నిర్మల. రైల్వే వ్యవస్థలో మౌలిక సదుపాయాలు పెంచడంపై దృష్టిపెట్టామన్నారు. 2018 నుంచి 2030 వరకు.. 12 ఏళ్ల కాలంలో రైల్వేలో ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కోసం రూ.50లక్షల కోట్ల పెట్టుబడుల అవసరం ఉందని చెప్పారు నిర్మల. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో వేగవంతమైన అభివృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సదుపాయాలు కల్పించడంపై దృష్టిపెట్టామన్నారు.