హ్యాపీ జర్నీ : హోలీ పండక్కి.. 540 ప్రత్యేక రైళ్లు

హ్యాపీ జర్నీ : హోలీ పండక్కి.. 540 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హోలీ పండుగ సందర్బంగా  540 అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పండుగకి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా సేఫ్ జర్నీ కోసం  ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.  గత పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ సంవత్సరం 219 సర్వీసులు అదనంగా పెంచామని తెలిపింది.  ఢిల్లీ నుండి పాట్నా, ముంబై నుండి గోరఖ్‌పూర్ , కోల్‌కతా నుంచి పూరీ వరకు ఈ రైళ్లు నడవనున్నట్లు వెల్లడించింది. 

హోలీ ప్రత్యేక రైళ్లు ఇవే..

  • ఢిల్లీ - పాట్నా
  • ఢిల్లీ-భాగల్పూర్
  • ఢిల్లీ-ముజఫర్‌పూర్
  • ఢిల్లీ-సహర్సా
  • గోరఖ్‌పూర్ -ముంబై
  • కోల్‌కతా-పూరి
  • గౌహతి- రాంచీ
  • న్యూఢిల్లీ- శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా
  • జైపూర్- బాంద్రా టెర్మినస్
  • పూణే- దానాపూర్
  • దుర్గ్-పాట్నా
  • బరౌని-సూరత్

పండగ సీజన్ కావడంతో రైల్వే స్టేషన్లో  ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది  టెర్మినస్ స్టేషన్‌లలో ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలోకి ప్రవేశించడానికి క్యూలు ఏర్పాటు చేస్తున్నారు.  ప్రయాణికుల భద్రతకు హామీకి ప్రధాన స్టేషన్లలో అదనపు RPF సిబ్బందిని మోహరించడంతో పాటు  అధిక భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. 

మరో వైపు దక్షిణ మధ్య రైల్వే కూడా మార్చి 14 నుంచి ఏప్రిల్​ 5 వరకు పలు  రూట్లలో స్పెషల్​ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఆయా తేదీల్లో సికింద్రాబాద్– దర్బంగా -సికింద్రాబాద్, హైదరాబాద్​ -పాట్నా-హైదరాబాద్, ముజఫర్ పూర్​-యశ్వంత్​పూర్– ముజఫర్​పూర్, సికింద్రాబాద్  -ముజఫర్​ఫూర్ -సికింద్రాబాద్, కోయంబత్తూర్– భగత్​కీ కోఠి -కోయంబత్తూర్, తంబరం- సంత్రగచ్చి- తంబరం, కొచ్చువెలి -ధనాపూర్- కొచ్చువెలి  స్టేషన్ల మధ్య స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. 

ALSO READ :- Ram Charan, Sukumar: రామ్ చరణ్, సుకుమార్ కాంబో రిపీట్.. ఇంట్రో చెప్పేసిన రాజమౌళి