Ram Charan, Sukumar: రామ్ చరణ్, సుకుమార్ కాంబో రిపీట్.. ఇంట్రో చెప్పేసిన రాజమౌళి

Ram Charan, Sukumar: రామ్ చరణ్, సుకుమార్ కాంబో రిపీట్.. ఇంట్రో చెప్పేసిన రాజమౌళి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నారు. ఆర్ఆర్ఆర్(RRR) వంటి గ్లోబల్ హిట్ తరువాత ఆయన క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకున్న నేపధ్యంలో తరువాత సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం   స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ పొలిటికల్ త్రిల్లర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. 

ఇక గేమ్ ఛేంజర్ తరువాత దర్శకుడు బుచ్చిబాబు సనతో మరో పాన్ ఇండియా సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు రామ్ చరణ్. RC16 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మార్చ్ 20న లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను కూడా భారీ లెవల్లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. రురల్ బ్యాక్డ్రాప్, స్పోర్ట్స్ డ్రామాతో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వ్రిద్ది సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. 

ఇక ఈ రెండు సినిమాల తరువాత మరోసారి క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తో జతకట్టనున్నారు రామ్ చరణ్. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఈ సినిమా. ఆలాంటి కాంబో ఇప్పుడు మరోసారి రిపీట్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రో గురించి ఆల్రెడీ హింట్ ఇచ్చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. 

ALSO READ :- Tulasivanam Web Series: ఓటీటీలోకి వచ్చిన త‌రుణ్ భాస్క‌ర్ కామెడీ వెబ్‌సిరీస్..ఫ‌స్ట్ ఎపిసోడ్ ఫ్రీ స్ట్రీమింగ్‌!

ఆర్ఆర్ఆర్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి రామ్ చరణ్, సుకుమార్ సినిమా గురించి మాట్లాడుతూ.. నాకు రామ్ చరణ్, సుకుమార్ చేయబోయే సినిమా గురించి తెలుసు. చాలా కొత్తగా ఉండబోతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానో రేపు మీరు చూశాక అర్థమవుతుంది.. అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇటీవల రామ్ చరణ్ కొత్త సినిమా మొదలైన నేపథ్యంలో.. రామ్ చరణ్, సుకుమార్ సినిమా గురించి ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.