Tulasivanam Web Series OTT: ఓటీటీలోకి వచ్చిన త‌రుణ్ భాస్క‌ర్ కామెడీ వెబ్‌సిరీస్..ఫ‌స్ట్ ఎపిసోడ్ ఫ్రీ స్ట్రీమింగ్‌!

Tulasivanam Web Series OTT: ఓటీటీలోకి వచ్చిన త‌రుణ్ భాస్క‌ర్ కామెడీ వెబ్‌సిరీస్..ఫ‌స్ట్ ఎపిసోడ్ ఫ్రీ స్ట్రీమింగ్‌!

తరుణ్ భాస్కర్ సమర్పణలో అక్షయ్, ఐశ్వర్య, వెంకటేష్ కాకమాను, విష్ణు ప్రధాన పాత్రలో అనిల్ రెడ్డి దర్శకత్వం వహించిన న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘తులసీవనం’. గురువారం (మార్చి 21న)ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది.ఫ‌స్ట్ ఎపిసోడ్‌ను ఫ్రీగా ఈటీవీ విన్‌లో చూడొచ్చొని ఓటీటీ సంస్థ అనౌన్స్ చేసింది. ప్రస్తుతానికి మొత్తం మూడు ఎపిసోడ్స్‌ను మాత్ర‌మే రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలో మిగిలిన ఎపిసోడ్స్ ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

ఈ సిరీస్‌ను స్వాగ‌త్ రెడ్డి, నీలిత పైడిప‌ల్లి, జీవ‌న్ కుమార్‌, ప్రీత‌మ్ క‌లిసిప్రొడ్యూస్ చేశారు. ముఖ్య పాత్తిరల్లో నటించిన అక్ష‌య్, ఐశ్వ‌ర్య క‌లిసి గ‌తంలో హాస్ట‌ల్ డేస్ అనే వెబ్‌సిరీస్ చేశారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సెకండ్ వెబ్‌సిరీస్ ఇది. క్యూట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ తో ఆసక్తి కలిగిస్తున్న ఈ వెబ్ సిరీస్ పై మంచి అంచనాలున్నాయి.

తెలుగు ఆడియన్స్ కు వెబ్ సీరిస్ లపై మంచి అభిప్రాయం ఉంది. ఒక్కసారి నచ్చితే..హిట్ చేసిందాకా వదలట్లేదు. అలా ఈ మధ్య వచ్చిన 90's వెబ్ సీరిస్ చూసి ప్రేక్షకుల అంత ఫిదా అయ్యారు. 

తులసి వనం కథ:

తుల‌సి అనే యువ‌కుడి లైఫ్ లో తాను అనుకున్నది..జరిగేది ఏంటనేది ఆసక్తిగా చూపించారు.తులసి చుట్టూ జరిగే కొన్ని ఫ‌న్నీ సంఘ‌ట‌న‌ల‌తో డైరెక్టర్ అనిల్ రెడ్డి ఈ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించాడు.చిన్నప్పటి నుంచి తుల‌సిని ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా చూడాల‌ని తండ్రి కోరుకుంటాడు.

ALSO READ :- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక భేటీ - సీట్లు, మ్యానిఫెస్టోకు తుది మెరుగులు..

కానీ తుల‌సి మాత్రం ఎలాగైనా క్రికెట‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటాడు. కానీ, చివరికి తండ్రి బ‌ల‌వంతంతో సాఫ్ట్‌వేర్ జాబ్‌లో తుల‌సి ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది? హైద‌రాబాద్ వ‌చ్చిన అత‌డు కన్న క‌ల‌ల‌కు..వాస్త‌వ జీవితానికి మ‌ధ్య లో లోపల ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొన్నాడ‌న్న‌ది ఈ సిరీస్‌లో ఆసక్తిగా చూపించారు.ఈ వెబ్‌సిరీస్‌లో అభిన‌వ్ గోమ‌టం గెస్ట్ రోల్‌లో కనిపించి ఆకట్టుకుంటాడు.