అక్టోబర్‌‌ 2 నుంచి రైల్వేలో ప్లాస్టిక్‌ నిషేధం

అక్టోబర్‌‌ 2 నుంచి రైల్వేలో  ప్లాస్టిక్‌ నిషేధం

న్యూఢిల్లీ: ప్లాస్టిక్‌ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రైల్వే శాఖలో ప్లాస్టిక్‌ వాడాకాన్ని  నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌‌ 2 నుంచి ప్లాస్టిక్‌ సంచులను, ప్లాస్టిక్‌ పదార్థాల వాడకాన్ని ఆపాలని సిబ్బంది, రైల్వే పరిధిలోని వ్యాపారులకు చెప్పింది. “అన్ని రైల్వే యూనిట్లలో 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ను నిషేధించాలి. ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించేందుకు, వాటిని పారేసేందుకు ఎకో ఫ్రెండ్లీ డిస్పోజల్‌ను ఏర్పాటు చేయాలి” అని రైల్వే శాఖ బుధవారం స్టేట్‌మెంట్‌రిలీజ్‌ చేసింది. ఎంప్లాయిస్‌ అందరూ రీయూజబుల్‌ బ్యాగ్స్‌ను ఉపయోగించాలని సూచించింది. త్వరలోనే ప్లాస్టిక్‌ వాటర్‌‌ బాటిల్స్‌ రిటర్న్‌ తీసుకునే పాలసీని ప్రవేశపెడతామని, బాటిల్‌ క్రషర్‌‌ మిషన్స్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.