పతకాలతో మెరిసిన ఇండియన్ సెయిలర్లు

పతకాలతో  మెరిసిన ఇండియన్ సెయిలర్లు

ఏషియాడ్‌‌లో ఇండియన్‌‌ సెయిలర్లు మెరిశారు. మెన్స్‌‌ స్కిఫ్‌‌ విభాగంలో మను ఫ్రాన్సిస్‌‌–ప్రిన్స్‌‌ కురిసింకల్‌‌ నోబుల్‌‌ రజత పతకం కైవసం చేసుకుంది. మొత్తం 9 రేసుల తర్వాత ఇండియన్‌‌ జోడీ 23 పాయింట్లుసాధించారు. వెన్‌‌ జైడింగ్‌‌–లియు టియాన్‌‌తో కూడిన చైనా 16 పాయింట్లతో స్వర్ణాన్ని గెలుచుకుంది. స్కిఫ్‌‌ సెయిలింగ్‌‌లో పాయింట్లు ప్రతి రేసులో ముగింపు స్థానం (ఫినిష్‌‌ పొజిషన్‌‌) ఆధారంగా నిర్ణయిస్తారు.

]తొలి స్థానంలో నిలిస్తే మొత్తం స్కోరులో ఒక్క పాయింట్‌‌ లభిస్తుంది. ఈ పోటీలో ఇండియన్స్‌‌ రేస్‌‌–3లో విజయం సాధించగా, రేస్‌‌–1, 5, 9లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఫ్రాన్సిస్‌‌–ప్రిన్స్‌‌ ముంబైలోని ఆర్మీ యాచింగ్‌‌ నోడ్‌‌లో శిక్షణ పొందారు. విమెన్స్‌‌ స్కిఫ్‌‌లో హర్షిత తోమర్‌‌–శీతల్‌‌ వర్మ బృందం కాంస్యాన్ని గెలుచుకుంది. 9 రేసుల తర్వాత హర్షిత–శీతల్‌‌ 24 నెట్‌‌ పాయింట్లతో కలిపి 28 పాయింట్లు సాధించారు.

రేస్‌‌–2, 6, 8లో మూడుసార్లు అనర్హతకు గురైన చైనా కంటే ఇండియన్స్‌‌ మెరుగైన ప్లేస్‌‌లో నిలిచారు. జపాన్‌‌ (14), హాంకాంగ్‌‌ (18) వరుసగా స్వర్ణం, సిల్వర్‌‌ కైవసం చేసుకుంది.