కైరో: ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో ఇండియా టాప్ లేపింది. టోర్నీ ఆఖరి రోజున రెండు మెడల్స్ నెగ్గి మొత్తం 16 పతకాలతో (5 గోల్డ్, 6 సిల్వర్, 5 బ్రాంజ్) అగ్రస్థానం సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ ఫైనల్లో 18 ఏండ్ల హేమంత్ బర్మన్ 351.7 పాయింట్లు స్కోరు చేసి రజతం గెలుచుకున్నాడు.
కజకిస్తాన్‌కు చెందిన ఒలేగ్ నోస్కోవ్ వరల్డ్ జూనియర్ రికార్డు స్కోరు 355.6తో స్వర్ణం సాధించాడు. ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఇండియా ద్వయం జుహైర్ ఖాన్– ఆద్యా కత్యాల్ 19 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకుంది.

