భారీ అంచనాలతో బరిలో దిగి.. కాంస్యంతోనే సరిపెట్టుకున్న భారత షట్లర్లు...

భారీ అంచనాలతో బరిలో దిగి.. కాంస్యంతోనే సరిపెట్టుకున్న భారత షట్లర్లు...

 

భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇండియా బ్యాడ్మింటన్‌‌‌‌ జట్టు కాంస్య పతకంతోనే సరిపెట్టుకుంది. బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌ సెమీఫైనల్లో ఇండియా 1–3తో చైనా చేతిలో ఓడింది. 2023 హాంగ్జౌ క్రీడల్లో రజతం నెగ్గిన టీమ్‌‌‌‌ ఈసారి దాన్ని పునరావృతం చేయలేకపోయింది. 

తొలి సింగిల్స్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌ 14వ ర్యాంకర్‌‌‌‌ లక్ష్యసేన్‌‌‌‌ 16–21, 18–21తో వరల్డ్‌‌‌‌ ఆరో ర్యాంకర్‌‌‌‌ షి యు కి చేతిలో కంగుతిన్నాడు. అయితే డబుల్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌–చిరాగ్ షెట్టి 21–11, 22–20తో వరల్డ్‌‌‌‌ చాంపియన్లు లియాంగ్‌‌‌‌ వీ కెంగ్‌‌‌‌–వాంగ్‌‌‌‌ చాంగ్‌‌‌‌ను ఓడించి స్కోరును 1–1తో సమం చేశారు. 

రెండో సింగిల్స్‌‌‌‌లో ఆయుష్‌‌‌‌ శెట్టి 19–21, 13–21తో లి షి ఫెంగ్‌‌‌‌ చేతిలో ఓడాడు. కీలకమైన నాలుగో మ్యాచ్‌‌‌‌లో హరిహరన్‌‌‌‌–అర్జున్‌‌‌‌ 16–21, 21–17, 9–21తో హి జి టింగ్‌‌‌‌–లియు యి చేతిలో ఓడటంతో ఇండియా మూడో ప్లేస్‌‌‌‌కే పరిమితమైంది. 40 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల మెన్స్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌లో ఇండియా వరుసగా పతకాలు సాధించడం ఇదే తొలిసారి.