కెనడాలో భారత విద్యార్థిని మృతి..అసలేం జరిగింది.?

కెనడాలో భారత విద్యార్థిని మృతి..అసలేం జరిగింది.?

కెనడాలో భారత విద్యార్థిని  తాన్యా త్యాగి మృతి కలకలం రేపుతోంది.  కాల్గరీ విశ్వవిద్యాలయంలో  చదువుతోన్న విద్యార్థి  తాన్యాత్యాగి మరణించారని భారత కాన్సులేట్ జనరల్   తెలిపింది. జూన్ 19న ఈ ఘటన జరగగా ఆమె మృతికి గల కారాణాలు తెలియలేదని వెల్లడించింది.దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

 ఢిల్లీకి చెందిన  తాన్యా త్యాగి అనే విద్యార్థిని ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లింది . త్యాగి కాల్గరీ యూనివర్శిటీలో చదువుకుంటోంది. జూన్ 19న మృతి చెందింది.  అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియలేదని భారత కాన్సులేట్ సంతాపం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.    కాల్గరీ విశ్వవిద్యాలయంలో భారత విద్యార్థిని  తాన్యా త్యాగి ఆకస్మిక మరణం  తమకు  బాధ కలిగించిందని కాన్సులేట్ Xలో పోస్ట్ చేసింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది. యువతి మృతికి గ ల కారణాలను తెలుసుకునేందకు దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది.