T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌..ఐపీఎల్ మధ్యలోనే భారత జట్టు ప్రకటన

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌..ఐపీఎల్ మధ్యలోనే భారత జట్టు ప్రకటన

క్రికెట్ అభిమానులు ప్రస్తుతం ఐపీఎల్ హడావుడిలో ఉన్నారు. ఈ మెగా టోర్నీ తర్వాత వారం రోజుల వ్యవధిలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 29న ముగుస్తుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ కోసం టీమిండియా స్క్వాడ్ ఎప్పుడు ప్రకటిస్తారో ఓక క్లారిటీ వచ్చింది. 

జట్లను ప్రకటించాడనికి ఐసీసీ కటాఫ్ తేదీ మే 1 అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో బీసీసీఐ టీ20 ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. "ఏప్రిల్ చివరి వారంలో భారత జట్టు ఎంపిక చేయబడుతుంది. ఆ సమయంలో సగం ఐపీఎల్ మ్యాచ్ లు ముగుస్తాయి". అని బీసీసీఐ సీనియర్ ఒకరు  PTIకి తెలిపింది. మే 19న ఐపీఎల్ లీగ్ దశ ముగిసిన వెంటనే మొదటి బ్యాచ్ గా.. ఐపీఎల్ ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన జట్ల ఆటగాళ్లు తర్వాత సెకండ్ బ్యాచ్ గా న్యూయార్క్‌కు బయలుదేరతారని బీసీసీఐలోని ఒక వర్గం తెలిపినట్లు సమాచారం. 

గ్రూప్ 'ఏ' లో పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, అమెరికా, భారత్ లు ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్, చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా  గ్రూప్‌ 'బి' లో  ఉన్నాయి. ఆతిథ్య వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పపువా న్యూ గినియా గ్రూప్ 'సి' లో తలపడతాయి. గ్రూప్ 'డి' లో సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాడ్స్, నేపాల్ జట్లతో గ్రూప్ ఆఫ్ డెత్ గా పరిగణిస్తున్నారు.   

Also Read: కోహ్లీ జట్టులో ఉన్నన్నాళ్లు RCB టైటిల్ గెలవదు

భారత్ మ్యాచ్ ల విషయానికి వస్తే జూన్ 5 న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్లు  జూన్ 9 న న్యూయార్క్ సిటీలో తలపడనున్నాయి. జూన్ 12 న న్యూయార్క్ లో అమెరికాపై, 15 న కెనడాతో ఫ్లోరిడాలో భారత్ లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది. భారత్ తమ గ్రూప్ మ్యాచ్ లన్ని అమెరికాలోనే ఆడబోతుంది.