IPL 2024: కోహ్లీ జట్టులో ఉన్నన్నాళ్లు RCB టైటిల్ గెలవదు: అభిమాని

IPL 2024: కోహ్లీ జట్టులో ఉన్నన్నాళ్లు RCB టైటిల్ గెలవదు: అభిమాని

మూడింటిలో ఒక విజయం.. ఇదీ ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబీ) జట్టు ప్రదర్శన. తొలి పోరులో చెన్నై చేతిలో ఓటమిపాలైన ఆర్‌సిబీ.. రెండో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తుచేసింది. ఈ గెలుపుతో గాడిలో పడ్డారనుకున్నప్పటికీ.. శనివారం కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ ఫలితం చేతివాటం అని నిరూపించారు. ఎప్పటిలానే బ్యాటర్లు ఆదుకున్నా.. బౌలర్లు చేతులెత్తేశారు. దీంతో 182 పరుగుల భారీ లక్ష్యం సైతం కేకేఆర్ ముందు చిన్నబోయింది. ఈ క్రమంలో విసుగు చెందిన ఓ ఆర్‌సిబీ అభిమాని.. ఆ జట్టు ప్రదర్సనపై, టైటిల్ గెలిచే అవకాశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Also Read : వీళ్లకసలు కళ్లున్నాయా: క్రికెట్ చరిత్రలోనే బంగ్లాదేశ్ చెత్త రివ్యూ

కేకేఆర్‌తో మ్యాచ్ అనంతరం ఓ అభిమాని మీడియాతో మాట్లాడుతూ.. ఆర్‌సిబీ ఐపీఎల్ టైటిల్ నెగ్గకపోవటానికి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీనే కారణమని నిందించాడు. "విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నన్నాళ్లు ఆర్‌సిబీ ఐపీఎల్ టైటిల్ గెలవదని బాంబు పేల్చాడు.. అదే సమయంలో మరో అభిమాని.. అతను చెప్పింది 100 శాతం నిజమని వ్యాఖ్యానించాడు.." అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విరాట్ నువ్ మా నమ్మకం

ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008 నుండి కోహ్లీ  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మార్చి 11, 2008లో ఆర్‌సీబీ జట్టులో చేరిన విరాట్.. ఆనాటి నుంచి మొత్తం 16 సీజన్ల పాటు ఆ జట్టుకే ఆడాడు. ఈ క్రమంలో తమ ఫ్రాంఛైజీ పట్ల అతను ఎంత నమ్మకంగా ఉన్నాడో తెలుపుతూ ఆర్‌సీబీ యాజమాన్యం ఇటీవల ఓ స్పెషల్ వీడియో రూపొందించింది.

2009, 2011, 2016 మూడుసార్లు ఫైనల్స్‌ చేరిన ఆర్‌సిబీ.. టైటిల్ అందుకోవడంలో మాత్రం విఫలమైంది. ఇక గతేడాది(ఐపీఎల్ 2023) ఆరో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.