ఉత్కంఠ పోరులో హార్దిక్ సేన విక్టరీ

ఉత్కంఠ పోరులో హార్దిక్ సేన విక్టరీ

రెండో టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 100 పరుగుల టార్గెట్ను భారత జట్టు 19.5  ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు చేయగా..ఇషాన్ కిషన్ 19, హార్దిక్ పాండ్యా 15, రాహుల్ త్రిపాఠి 13 పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రేస్ వెల్, ఇష్ సోధీ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది. చివరి మ్యాచ్  ఫిబ్రవరి 1న జరగనుంది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారత్ బౌలర్ల ధాటికి 99 పరుగులే చేసింది. 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. భారత బౌలర్ల ధాటికి తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఈ క్రమంలోనే కేవలం 60 పరుగులకే కివీస్ సగం వికెట్లు కోల్పోయి పీకల్లతో కష్టాల్లో పడింది. ఈ సమయంలో బ్రేస్ వెల్ , సాంట్నర్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. సింగిల్స్ తీస్తూనే స్కోరు బోర్డును నడిపించారు. ఇదే క్రమంలో 6వ వికెట్ కు 20 పరుగులు జోడించారు. అయితే 14 పరుగులు చేసిన బ్రేస్ వెల్ ను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్  వికెట్లు మరోసారి టపటపా రాలాయి. వచ్చిన బ్యాట్స్ మన్ క్రీజులో ఉండటం కన్నా..పెవీలియన్ చేరుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపినట్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. చివరకు న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ రెండు వికెట్లు కోల్పోగా..పాండ్యా, సుందర్, చాహల్, హుడా, కుల్దీప్ యాదవ్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.