H1B Visa : ఇండియన్ టెకీలకు అమెరికా గుడ్ న్యూస్

H1B Visa : ఇండియన్ టెకీలకు అమెరికా గుడ్ న్యూస్

వాషింగ్టన్ : హెచ్1 బీ, ఎల్ 1 వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. "డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్" ను త్వరలో పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని  విభాగాల్లో ఈ విధానాన్ని ఈ ఏడాది జులై తర్వాత ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తి స్థాయిలో అమలైతే అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది ఇండియన్ టెకీలకు పెద్ద రిలీఫ్ దొరకనుంది.  2004 వరకు కొన్ని కేటగిరీలకు చెందిన నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు ముఖ్యంగా హెచ్1బీ వీసాల రెన్యూవల్ అమెరికాలోనే జరిగేది. కానీ ఆ తర్వాత నిబంధనల్లో మార్పు చేశారు. 

హెచ్1బీ వీసాదారులు గడువు ముగిసిన తర్వాత వారి స్వదేశాలకు వెళ్లి పాస్ పోర్టులపై వీసా ఎక్స్టెన్షన్ స్టాపింగ్ చేయించుకోవాల్సి వస్తోంది. అయితే ఈ ప్రక్రియ అంత సులభతరం కాకపోవడంతో ఉద్యోగులతో పాటు అమెరికన్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అన్ని డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ ఒక్కోసారి వీసా, పాస్ పోర్ట్ స్టాంపింగ్ కు రెండేళ్ల వరకు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ ప్రక్రియను పునర్ ప్రారంభించాలని ప్రెసిడెన్షియల్ కమిషన్ గత కొన్నేళ్లుగా అభ్యర్థిస్తోంది.