60 ఏండ్ల తర్వాత..ఇయ్యాల్టి నుంచి పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో ఇండియా డేవిస్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్

60 ఏండ్ల తర్వాత..ఇయ్యాల్టి నుంచి పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో ఇండియా డేవిస్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్

ఇస్లామాబాద్‌ ‌‌‌‌‌‌‌:  దాదాపు 60 ఏండ్ల తర్వాత పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ గడ్డపై డేవిస్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడేందుకు ఇండియా టెన్నిస్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ సిద్ధమైంది. టాప్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు లేకుండానే శనివారం నుంచి జరిగే వరల్డ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌–1 ప్లే ఆఫ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడనుంది. డేవిస్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ చరిత్రలో ఇప్పటి వరకు  పాక్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఇండియా ఓడలేదు. ఆడిన ఏడుసార్లు విజయం సాధించింది.

దీంతో ఈసారి కూడా ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గానే బరిలోకి దిగుతోంది. అయితే ఇండియాకు గట్టి పోటీ ఇవ్వాలని పాక్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు ఐజమ్‌‌‌‌‌‌‌‌ ఉల్‌‌‌‌‌‌‌‌ హక్‌‌‌‌‌‌‌‌ ఖురేషి, అఖీల్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ ఈసారి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల కోసం గ్రాస్‌‌‌‌‌‌‌‌ కోర్టులను ఎంచుకున్నారు. ఫాస్ట్ సర్ఫెస్‌‌‌‌‌‌‌‌తో పాటు లో బౌన్స్‌‌‌‌‌‌‌‌ ఉండేలా కోర్టులను రూపొందించారు. ఇలాంటి కోర్టులపై ఖురేషి, అఖీల్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌కు మంచి రికార్డు ఉంది.

ఇండియా తరఫున శ్రీరామ్‌‌‌‌‌‌‌‌ బాలాజీ, రామ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, యూకీ బాంబ్రీ, సాకేత్‌‌‌‌‌‌‌‌ మైనేని బరిలోకి దిగుతున్నారు. తొలి రోజు జరిగే  రెండు సింగిల్స్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఖురేషితో రామ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, అఖీల్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌తో శ్రీరామ్‌‌‌‌‌‌‌‌ తలపడనున్నారు. ఆదివారం జరిగే డబుల్స్‌‌‌‌‌‌‌‌లో బర్కతుల్లా–ముజామిల్‌‌‌‌‌‌‌‌ ముర్తజాతో యూకీ బాంబ్రీ–సాకేత్‌‌‌‌‌‌‌‌ మైనేని, రివర్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో  రామ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌.. అఖీల్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌తో, శ్రీరామ్‌‌‌‌‌‌‌‌.. ఖురేషితో అమీతుమీ తేల్చుకోనున్నారు.