ఆసియా క్రీడలకు వెళ్లి ఏంటా పని.. ఇండియన్ అంపైర్ను ఇంటికి పంపిన ఫెడరేషన్

ఆసియా క్రీడలకు వెళ్లి ఏంటా పని..  ఇండియన్ అంపైర్ను ఇంటికి పంపిన ఫెడరేషన్

ఇది భారత్కు కాస్త తలనొప్పి వ్యవహారమే. విశ్వవేదికపై భారత్ పరువు తీసిన అంశం. ఆసియా క్రీడల్లో అంపైర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి.. చేసిన పనికి మీ సేవలు చాలు ఇక మీ స్వదేశానికి వెళ్లండి అని సాగనంపాల్సిన పరిస్థితి. హాకీ అంపైర్ గురిందర్ సింగ్ సంఘా లైంగికంగా దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు తేలడంతో ఆయనను ఈవెంట్ నుంచి సస్పెండ్ చేసి ఇండియాకు పంపించారు. 

పీటీఐ ప్రకారం.. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా నగోయాలో ఉన్న అంపైర్ సంఘా.. మలేషియాకు చెందిన ఒక మహిళా హాకీ ప్రతినిధితో పాటు హోటల్ స్టాఫ్ తో లైంగిక చర్యలకు, వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు. మలేషియా హాకీ ప్రతినిధి  ఫిర్యాదుతో సంఘాను భారత్ కు పంపిచారు. 

గేమ్స్ తర్వాత సంఘాపై హెచ్ఐ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని అడగ్గా, ఆసియా హాకీ ఫెడరేషన్ నుండి రిపోర్ట్  అందిన తర్వాత అవసరమై చర్యలు తీసుకుంటామాని హాకీ ఇండియా స్పష్టం చేసింది. అతను దోషి అని తేలితే వదిలిపెట్టేది లేదని  అన్నారు.  

ఆసియా క్రీడలలో హాకీ ఈవెంట్ల కోసం అంపైర్లు,  టెక్నికల్ అధికారులను AHF నియమిస్తుంది. సంఘాపై ఇలాంటి ఫిర్యాదు రావడం ఇది మొదటిసారి కాదు. 2025లో రాంచీలో జరిగిన హాకీ ఇండియా లీగ్ సందర్భంగా, ఒక మహిళా అంపైర్ అతనిపై ఫిర్యాదు చేశారు.  ఆ ఆరోపణలపై విచారణ జరిపేందుకు HI ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, విచారణలో సంఘాకు వ్యతిరేకంగా ఎలాంటి బలమైన ఆధారాలు లభించలేదని HI అధికారి తెలిపారు.

ఆసియా క్రీడలలో హాకీ ఈవెంట్ల కోసం అంపైర్లు మరియు సాంకేతిక అధికారులను AHF నియమిస్తుంది. సంఘాపై ఇలాంటి ఫిర్యాదు రావడం ఇది మొదటిసారి కాదు. 2025లో రాంచీలో జరిగిన హాకీ ఇండియా లీగ్ సందర్భంగా, ఒక మహిళా అంపైర్ అతనిపై ఫిర్యాదు చేశారు. తదనంతరం, ఆ ఆరోపణలపై విచారణ జరిపేందుకు HI ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, విచారణలో సంఘాకు వ్యతిరేకంగా ఎలాంటి బలమైన ఆధారాలు లభించలేదని HI అధికారి తెలిపారు.