ఇండియన్ విస్కీకి వరల్డ్ నంబర్ వన్ అవార్డ్

ఇండియన్ విస్కీకి వరల్డ్ నంబర్ వన్ అవార్డ్

ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీగా భారతీయ విస్కీకి అవార్డు లభించింది. ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ 2023 విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అవార్డ్స్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీగా అవార్డు పొందింది. ఈ అవార్డుతో భారతీయ విస్కీలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ 2023 ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది ప్రసిద్ధ బ్రాండ్‌లను మించిపోయింది. భారతీయ సింగిల్ మాల్ట్ స్కాచ్ బోర్బన్, కెనడియన్, ఆస్ట్రేలియన్, బ్రిటిష్ సింగిల్ మాల్ట్‌లతో సహా అంతర్జాతీయ బ్రాండ్‌లను ఓడించింది.

ఇంద్రి విస్కీని పికాడిల్లీ డిస్టిలరీస్ ఉత్పత్తి చేస్తోంది. ఇది విస్కీలో నాణ్యత పట్ల తన నిబద్ధతను ప్రదర్శించింది. దీనికి డబుల్ గోల్డ్ బెస్ట్ ఇన్ షో అవార్డు లభించింది. ఈ విస్కీని రాజస్థాన్‌లో ఎంపిక చేసిన బార్లీ గింజలు, యమునా నది నుంచి తాజా హిమానీనద నీటిని ఉపయోగించి హిమాలయ పర్వత ప్రాంతాల్లో తయారు చేస్తారు. ఈ విస్కీలో తీపి ఎండుద్రాక్షలను ఉపయోగిస్తారు. విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అవార్డ్స్ అనేది పానీయాల పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైనది.