Gold Rate: సంక్రాంతి రోజున తగ్గిన గోల్డ్ రేటు.. తగ్గేదే లే అంటున్న వెండి.. హైదరాబాద్ రేట్లివే

Gold Rate: సంక్రాంతి రోజున తగ్గిన గోల్డ్ రేటు.. తగ్గేదే లే అంటున్న వెండి.. హైదరాబాద్ రేట్లివే

పండుగ పూట రానే వచ్చింది. బంగారం, వెండి ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు ప్రజలకు గోల్డ్ కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది. ఇక వెండి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్లుగా రేట్లు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక, రాజకీయ, భౌగోళిక ఉద్రిక్త వాతావరణం కారణంగా రోజులు గడుస్తున్నప్పటికీ రేట్ల తగ్గింపు సూచనలు కనిపించటం లేదు. పండుగ వేళ షాపింగ్ చేయాలనుకుంటే తాజా రేట్లను ఖచ్చితంగా పరిశీలంచాల్సిందే.

ALSO READ : టెక్ కంపెనీలకు కొత్త లేబర్ కోడ్స్ షాక్..

జనవరి 15న సంక్రాంతి పండుగ రోజున బంగారం రేట్లు స్వల్ప తగ్గుదలతో వినియోగదారులకు ఊరటను అందించాయి. దీంతో జనవరి 14 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.82 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 318గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 125గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : జనవరి 20న లాజిస్టిక్స్ కంపెనీ షాడోఫ్యాక్స్ ఐపీఓ

ఇక వెండి విషయానికి వస్తే భారీ ర్యాలీ అదే దూకుడుతో కొనసాగుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. అయితే గురువారం జనవరి 15, 2025న వెండి రేటు కేజీకి రూ.5వేలు పెరిగి కొనుగోలుదారులను షాక్ కి గురిచేస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల 10వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.310 వద్ద ఉంది.