
సోమవారం ( అక్టోబర్ 6 ) భారత మహిళా క్రికెట్ టీం విశాఖపట్నానికి చేరుకోనుంది. ఈ నెల 9 నుంచి వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మహిళా ప్రపంచ కప్ మ్యాచులు జరగనున్న క్రమంలో రేపు విశాఖకు చేరుకోనుంది ఇండియన్ టీం. విశాఖలో ఐదు మ్యాచుల షెడ్యూల్ జరగనుంది. 9న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ తో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ అక్టోబర్ 26న జరిగే ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజీలాండ్ మ్యాచ్ తో ముగియనుంది.
విశాఖలో జరగనున్న ఐదు మ్యాచుల షెడ్యూల్ ఇదే:
- 9 తేదీన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా
- 12న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
- 13న సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్
- 16న ఆస్ట్రేలియా వర్సెస్ బాగ్లాదేశ్
- 26న ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్
ఇదిలా ఉండగా ఇవాళ ( అక్టోబర్ 5 ) విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న టీమిండియా వర్సె్స్ పాకిస్తాన్ మ్యాచ్లో టీమిండియా ఆలౌట్ అయింది. నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు చేసింది. 248 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందు నిలిపింది. పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. 48 పరుగుల దగ్గర టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. స్మృతి మందన 23 పరుగులకు ఔట్ అయింది. ఫాతిమా సనా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి ఈ స్టార్ బ్యాటర్ నిరాశపరిచింది.