కామన్వెల్త్ ఆరంభం అదిరింది..

కామన్వెల్త్ ఆరంభం అదిరింది..

కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళల క్రికెట్ జట్టు గోల్డ్ వేట ప్రారంభించబోతుంది. ఇవాళ (శుక్రవారం) 4 గంటల 30 నిమిషాలకు ఆసీస్తో  మ్యాచ్ జరగబోతుంది. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో  మహిళల క్రికెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగబోతుంది. ఫస్ట్ మ్యాచులోనే వరల్డ్ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. అటు 2020లో టీ20, 2022లో వన్డే వరల్డ్ కప్ విజయాలతో ఆసీస్ మాంచి జోరుమీదుంది. దీనికి తోడు స్టార్‌ ఆల్‌రౌండర్‌ పూజ వస్త్రాకర్‌ కొవిడ్‌ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడం జట్టుకు భారత్ కు మైనస్ పాయింట్. అయితే  బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, షెఫాలివర్మ.. బౌలింగ్‌లో పూనమ్, రాజేశ్వరి, దీప్తి చెలరేగితే మాత్రం భారత్ ను ఆపడం ఆసీస్ కు కష్టమే. 

బర్మింగ్‌హామ్  అలెగ్జాండర్ స్టేడియంలో  కామన్వెల్త్ గేమ్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బ్రిటిష్ మ్యూజిక్ ఐకాన్ డురాన్ పాప్ సంగీతంతో హోరెత్తించాడు. డురాన్‌, బ్లాక్ సబ్బాత్‌కు చెందిన టోనీ బయోమీ, లోకల్ ర్యాంపర్స్ ఇండిగో మార్షల్ గాంబిని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.  బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్.. విక్టోరియా స్క్వేర్‌లో ఫెస్టివల్ సైట్‌ను సందర్శించారు. ఆరంభం వేడుకల్లో 2 వేల మంది కళాకారులు పాల్గొన్నారు.

 మరోవైపు భారత బృందం.. గేమ్స్ విలేజ్‌లో ఫ్లాగ్ హోస్టింగ్ సెర్మనీని ఘనంగా నిర్వహించింది. ఓపెనింగ్ సెర్మనీలో పంజాబ్ పాటకు భంగ్రా డ్యాన్స్‌ను చేశారు. బాణసంచా వెలుగులతో పాప్ మ్యూజిక్‌ హోరుతో స్టేడియం దద్దరిల్లింది.