జొహన్నెస్‌బర్గ్: ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ డిసెంబర్‌లో సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ టూర్‌లో ఇండియా, సఫారీ జట్ల మధ్య ఒక టెస్టు మ్యాచ్, మూడు వన్డేల సిరీస్ జరగనుందని క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్‌ఏ) శుక్రవారం ప్రకటించింది.
ఐసీసీ విమెన్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా డిసెంబర్ 9 నుంచి 15 వరకు పోచెఫ్‌స్ట్రూమ్, బ్లూమ్‌ఫోంటైన్, కేప్ టౌన్ నగరాల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఆ తర్వాత డిసెంబర్ 20– 23 వరకు పోర్ట్ ఎలిజబెత్ లోని సెయింట్ జార్జ్ పార్క్ గ్రౌండ్‌లో ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది.
