రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్.. నలుగురి మృతి.. మృతుల్లో భారతీయుడు

రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్.. నలుగురి మృతి.. మృతుల్లో భారతీయుడు

రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. శని, ఆదివారం(మే16,17) రాత్రి జరిపిన దాడుల్లో నలుగురు చనిపోయారు. వారిలో ఒకరు భారతీయుడు ఉన్నాడు. మరో ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడినట్లు రష్యాలోని ఇండియన్ ఎంబసీ  తెలిపింది. సంఘటనాస్థలాన్ని సందర్శించారు  ఇండియన్ ఎంబసీ అధికారులు. మృతుడి గుర్తింపును ఇంకా వెల్లడించలేదు.గాయపడి చికిత్స పొందుతున్న వారిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వారికి అన్ని విధాలా సాయం చేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా ఇటీవల కాలంలో  రష్యాపై ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఇదే పెద్దది. 

రష్యాపై జరిగిన డ్రోన్ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధృవీకరించారు. X లో  దాడుల వీడియోను షేర్ చేశారు. ఖచ్చితమైన దాడులు జరిగాయి.. ఉక్రెయిన్ నుంచి 500 కి.మీ లపైగా ఉన్న మాస్కో ప్రాంంతలో రష్యన్ వైమానిక రక్షణ కేంద్ర సమీపంలో దాడులు చేశాం.. ఇది ఉక్రెయిన్ విజయం..సైన్యానికి ధన్యావాదాలు అంటూ  జెలెన్స్ స్కీ పోస్ట్ చేశారు.