Asia Cup 2025: మరికొన్ని గంటల్లో ఆసియా కప్ స్క్వాడ్ ప్రకటన.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

Asia Cup 2025: మరికొన్ని గంటల్లో ఆసియా కప్ స్క్వాడ్ ప్రకటన.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

యూఏఈ వేదికగా వచ్చే నెలలో జరగనున్న ఆసియా కప్ కు టీమిండియా స్క్వాడ్ ను నేడు (మంగళవారం, ఆగస్టు 19)  ప్రకటించనున్నారు. విలేకరుల సమావేశంలో సెలక్షన్ కమిటీ మధ్యాహ్నం 1:30 నిమిషాలకు భారత జట్టును అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3:30 నిమిషాలకు వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ మహిళల జట్టును ప్రకటించనుంది. దీంతో ఒకే రోజు రెండు స్క్వాడ్ లను సిద్ధం చేసే పనిలో బీసీసీఐ బిజీగా ఉంది. ఆసియా కప్ కోసం టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.. 

ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ టీమిండియాలో కొనసాగనున్నారు. బ్యాకప్ ఓపెనర్ గా గిల్ లేదా జైశ్వాల్ లో ఎవరిని ఎంపిక  చేస్తారో ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య మిడిల్ ఆర్డర్ లో ఆడనున్నారు. శ్రేయాస్ అయ్యర్ ను సెలక్ట్ అవుతాడో లేదో చూడాలి. రింకూ లేదా శివమ్ దూబే లలో ఒకరికే ఛాన్స్ దక్కనుంది. ఆల్ రౌండర్ దూబే వైపే సెలక్టర్లు మొగ్గు చూపొచ్చు. స్పిన్ ఆల్ రౌండర్ గా అక్షర్ పటేల్ జట్టులో ఉండడం ఖాయం. అతనితో పాటుగా వాషింగ్ టన్ సుందర్ జట్టులో అవసరమని సెలక్టర్లు భావించకపోవచ్చు. 

స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ లకు చోటు పక్కా. ఆసియా పిచ్ లు కావడంతో బ్యాకప్ స్పిన్నర్ గా రవి బిష్ణోయ్ ని తీసుకోవచ్చు. ఒకవేళ బ్యాటింగ్ కు కూడా పనికొస్తాడనుకుంటే బిష్ణోయ్ ని కాకుండా సుందర్ కు ఛాన్స్ ఇవ్వొచ్చు. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ జట్టులో టాప్ బౌలర్లుగా ఎంపిక అవుతారు. బ్యాకప్ ఫాస్ట్ బౌలర్ గా హర్షిత్ రానా లేదా ప్రసిద్ కృష్ణలలో ఒకరికి చోటు దక్కొచ్చు. పంత్ అందుబాటులో లేకపోవడంతో రిజర్వ్ వికెట్ కీపర్ కీపర్ గా జితేష్ శర్మకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. 

లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

ఆసియా కప్ జట్టు ప్రకటనను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఆన్ లైన్ స్ట్రీమింగ్ జియో హాట్ స్టార్ యాప్‌లో లైవ్ చూడొచ్చు. మధ్యాహ్నం 1:30 నిమిషాలకు స్క్వాడ్ ను ప్రకటించనున్నారు.   

ఆసియా కప్‌కు టీమిండియా స్క్వాడ్ (అంచనా): 

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా , శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ సింగ్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, హర్షిత్ రానా