- సెయిలింగ్‌లోనూ సిల్వర్ మెడల్
- ఆర్చరీ, స్క్వాష్‌లో బ్రాంజ్ మెడల్స్
నగోయా: ఇండియా రెజ్లర్ నితేష్ సివాచ్.. ఆసియా క్రీడల్లో రజత పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన మెన్స్ 97 కేజీల ఫైనల్లో నితేష్ 0–4తో యురి నకజా (జపాన్) చేతిలో ఓడాడు. దాంతో గ్రీకో రోమన్ రెజ్లింగ్‌లో 1962 తర్వాత ఇండియాకు తొలి సిల్వర్ మెడల్‌ను అందించిన ఘనతను సంపాదించాడు. అప్పటి క్రీడల్లో మాల్వా సింగ్ (52 కేజీ), గణపత్ అండల్కర్ (+97 కేజీ) స్వర్ణాలు సాధించగా, ఉదయ్ చంద్ (70 కేజీ), సజ్జన్ సింగ్ (87 కేజీ), మారుతి మానే (97 కేజీ) రజతాలను సొంతం చేసుకున్నారు.
అప్పటి ఈవెంట్‌లో రెజ్లర్లు మెన్స్ ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్ విభాగాల్లో పోటీపడ్డారు. హోరాహోరీగా సాగిన ఫైనల్ బౌట్‌లో నితేష్ స్టార్టింగ్ నుంచే టూ ఆన్ వన్ గ్రిప్ కోసం ప్రయత్నించాడు. కానీ నకాజటో చాన్స్ ఇవ్వలేదు. నితేష్‌ను మ్యాట్ బయటకు నెట్టేసి స్కోరింగ్ సాధించాడు. ఆ వెంటనే నితేష్‌ను గ్రౌండ్ పొజిషన్‌లోకి తీసుకురావడంతో కదలకుండా ఉండిపోయాడు.
దాంతో జపాన్ రెజ్లర్ తొలి పీరియడ్‌ను 2–0తో ముగించాడు. రెండో పీరియడ్‌లో టేక్‌డౌన్‌ను సాధించడంతో స్కోరు 4–0కు పెరిగింది. పోటీ మరో నిమిషంలో ముగుస్తుందనగా నితేష్ ఎదురుదాడికి దిగినా.. నకాజటో స్కోరింగ్ మూవ్‌ను అడ్డుకుని విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో నితేష్ 7–1తో అమన్‌బెర్డి అగమమ్మెడోవ్ (తుర్క్‌మెనిస్తాన్)పై గెలిచాడు. విమెన్స్ కేటగిరీలో మాన్సీ 2–5తో ఆల్ట్‌జిన్ టోగ్టోఖ్ (మంగోలియా) చేతిలో ఓడి పతకానికి దూరమైంది.
మంగోలియన్ డిఫెన్స్ ముందు ఇండియన్ రెజ్లర్ తేలిపోయింది. క్వార్టర్స్‌లో 6–1తో ఇరినా కుజ్నెత్సోవా (కిర్గిస్తాన్)పై గెలిచిన మాన్సీ.. సెమీస్‌లో 0–6తో నొనోకా ఒజా కి (జపాన్) చేతిలో కంగుతిన్నది. సుమిత్ (60 కేజీ లు), అమన్ బరోనియా (77 కేజీలు) క్వార్టర్‌ఫైనల్స్‌లో ఓడిపోవడంతో ఇప్పటికే పతకాల రేసు నుండి నిష్క్రమించారు.
