సర్వీసెస్​ ఇండస్ట్రీలో ఇండియా దూసుకెళ్లొచ్చు: రఘురామ్​ రాజన్​

సర్వీసెస్​ ఇండస్ట్రీలో ఇండియా దూసుకెళ్లొచ్చు: రఘురామ్​ రాజన్​

లండన్​: గ్లోబల్​ సప్లయ్​ చెయిన్స్​లో కీలకంగా మారడంతోపాటు, సర్వీసెస్​ ఇండస్ట్రీలో లీడర్షిప్​ సాధించే సత్తా ఇండియాకు ఉందని ఆర్​బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్​ చెప్పారు. డెమొక్రటిక్​ వాల్యూస్​ పాటించడం వల్ల ఇండియాపై ప్రపంచ దేశాలకు నమ్మకం పెరిగే ఛాన్స్​ ఉంటుందని, ఈ దిశలో చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు.

మాన్యుఫాక్చరింగ్​ సెక్టార్లోని సర్వీసెస్​ కాంపోనెంట్​తోపాటు, సర్వీసెస్​లోనూ నమ్మకమైన గ్లోబల్​ సప్లయర్​గా అవతరించేందుకు ఇండియా ఫోకస్​ పెట్టాలని అన్నారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ, స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం...దేశం దూసుకెళ్లేందుకు వీలు కల్పిస్తాయని చెప్పారు. ఐడియాస్​ ఫర్​ ఇండియా కాన్ఫరెన్స్​లో రఘురామ్​ రాజన్​ మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు.