- 5-6 శాతం వృద్ధి ఉంటుంది: హెచ్‌వీఎస్ అనరాక్
న్యూఢిల్లీ: ఇండియాలో 2026లో హోటల్ రూమ్ సగటు ధరలు 5–6శాతం పెరిగి ఒక రాత్రికి రూ.9,400–రూ.9,700 రేంజ్‌కి చేరనున్నాయి. కన్సల్టెన్సీ కంపెనీ హెచ్‌వీఎస్ అనరాక్ ప్రకారం, 2025లో గదుల ధరలు 7శాతం పెరిగి రూ.8,800–రూ.9,200 మధ్య స్థిరపడ్డాయి. ఆక్యుపెన్సీ 65–67శాతం వద్ద ముగిసింది. డిమాండ్ సరఫరా కంటే ఎక్కువగా ఉండటం, దేశీయ పర్యాటకం, కార్పొరేట్ ట్రావెల్, అంతర్జాతీయ రాకలు పెరగడం వృద్ధికి కారణమవుతున్నాయి.
‘‘2026లో రెవెన్యూ పెర్ అవైలబుల్ రూమ్ (రెవ్‌పార్) సగటున రూ.6,300– రూ. 6,800కు చేరుతుంది. జియో వరల్డ్, యశోభూమి, భారత్ మండపం వంటి కన్వెన్షన్ సెంటర్లు ఎంఐసీఈ (మీటింగ్స్ ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్) డిమాండ్‌ను పెంచుతున్నాయి”అని హెచ్‌వీఎస్ అనరాక్ అంచనావేసింది.
డాలర్ పరంగా రూమ్ సగటు ధరలు 2007–08 పీక్స్ కంటే తక్కువగా ఉన్నా, దేశీయంగా ఆల్‌టైమ్ హైలో ఉన్నాయి. మిడ్‌స్కేల్, అప్పర్ మిడ్‌స్కేల్ హోటళ్లు 50శాతం పైగా కొత్త సరఫరా కలిగి ఉన్నాయి. మరోవైపు ఎక్కువ లాంగ్ వీకెండ్స్ ఉండటం వల్ల కొత్త సంవత్సరంలో షార్ట్ లీజర్ ట్రావెల్ పెరుగుతుందని అంచనా. దీంతో హోటల్ ఇండస్ట్రీ లాభపడనుంది.
