జీఎస్టీ తగ్గింపుతో జోష్ ..పెరిగిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు

జీఎస్టీ తగ్గింపుతో జోష్ ..పెరిగిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు
  • నివా బూపా సీఈఓ కృష్ణన్ ​వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: మనదేశ బీమా రంగం 2025లో కీలక మార్పులకు లోనైందని, ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాద, ప్రయాణ బీమాలకు జీఎస్​టీ నుంచి పూర్తి మినహాయింపు లభించడంతో కంపెనీలకు మేలు జరిగిందని నివా బూపా హెల్త్​ ఇన్సూరెన్స్​ సీఈఓ కృష్ణన్​ రామచంద్రన్ అన్నారు. 

సబ్​కా బీమా సబ్​కీ రక్ష బిల్లు ద్వారా బీమా కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచడాన్ని స్వాగతించారు. దీనివల్ల గ్లోబల్ నైపుణ్యం, పోటీతత్వం పెరుగుతాయని అన్నారు. ‘‘స్టాండఎలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు 10.4 శాతం పెరిగి రూ.3,622 కోట్లకు చేరాయి. 

2047 నాటికి అందరికీ బీమా లక్ష్యంతో ఈ రంగం ముందుకు సాగుతోంది. 90 శాతం పాలసీలు డిజిటల్ రూపంలో జారీ అవుతున్నాయి. 60 నుంచి 70 శాతం క్లెయిమ్‌‌‌‌లు నగదు రహిత పద్ధతిలో జరుగుతున్నాయి. ఏఐ వాడకం క్లెయిమ్‌‌‌‌ల పరిష్కారం వేగవంతం చేసింది. మహిళలు, వృద్ధులు, ఎంఎస్​ఎంఈల కోసం ప్రత్యేక ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి”అని రామచంద్రన్ వివరించారు.