ఏపీలో ఫెంగల్ తుఫాను బీభత్సం మొదలైంది. తీవ్ర వాయుగుండంగా మారిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ( నవంబర్ 29, 2024 ) రాత్రి నుండి తిరుపతిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు బలంగా వీస్తుండటంతో తిరుపతి ఎయిర్పోర్టులో 4 విమాన సర్వీసులను రద్దు చేసింది ఇండిగో ఎయిర్లైన్స్. తిరుపతి నుండి హైదరాబాద్, విశాఖ, బెంగళూరుకు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది ఇండిగో ఎయిర్ లైన్స్.
ఫెంగల్ తుఫాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.చిత్తూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.సత్యసాయి,కడప, చిత్తూరు, జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కోస్తాంధ్రలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.
Also Read :- TGPSC కొత్త చైర్మన్‍గా బుర్రా వెంకటేశం
శని, ఆదివారాల్లో ( నవంబర్ 30, డిసెంబర్ 1, 2024 ) గంటకు 50-60 కి.మీ గరిష్టంగా 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న క్రమంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లోద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళద్దని సూచించింది వాతావరణ శాఖ. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది వాతావరణ శాఖ.