ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ కు రాకుండా ముంబైకి దారి మళ్లింపు

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ కు రాకుండా ముంబైకి దారి మళ్లింపు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్​కు శనివారం జెడ్డా నుంచి వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్​వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ముంబై ఎయిర్​పోర్ట్​కు దారి మళ్లించి అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడ ల్యాండ్​అయిన వెంటనే ప్రయాణికులను ఒక్కొక్కరిగా కిందకు దింపి తనిఖీలు చేశారు. అయితే, బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత కొంతమంది ప్రయాణికులను అక్కడే దింపిన విమానం మరికొంతమందితో శంషాబాద్​చేరుకుంది. ఫేక్ మెయిల్ పంపిన నిందితుడిని గుర్తించే పనిలో ఇంటలిజెన్స్ వర్గాలు నిమగ్నమయ్యాయి.