ఇండిగో విమానాల రద్దు ప్రయాణికులకు పెద్ద తలనొప్పిగా మారింది. వరుసగా ఐదో రోజు శని వారం కూడా పెద్ద ఎత్తున ఫ్లైట్లను ఆ సంస్థ క్యాన్సిల్ చేసింది. దేశవ్యాప్తంగా శనివారం దాదాపు 400కు పైగా విమానాలను రద్దు చేసింది. మరికొన్నింటిని ఆలస్యంగా నడిపింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లైట్ల కోసం ఎయిర్‌పోర్టుల్లో గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నారు.
ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ఎయిర్‌పోర్టుల్లో వేలాది మంది ప్యాసింజర్లు వేచి చూస్తున్నారు. ఇండిగో తీరును నిరసిస్తూ కొన్నిచోట్ల ఆందోళనలు చేపట్టారు. హైదరాబాద్లో ఒక నైజీరియన్ మహిళ శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో సిబ్బందిపై విరుచుకుపడింది. ఇండిగో సిబ్బంది రిజర్వేషన్ కౌంటర్ దగ్గర పైకెక్కి హల్చల్ చేసింది. ఇండిగో సిబ్బందిపై కేకలేస్తూ నానా రచ్చ చేసింది.
మన దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్ కంపెనీ అయిన ఇండిగో.. ప్రతిరోజు 2,300 డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు నడుపుతుంది. అయితే పైలెట్ల డ్యూటీ రూల్స్‌ను మారుస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు ఇవ్వడం, అందుకు అనుగుణంగా ఇండిగో ప్లాన్ చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది.
మంగళవారం 100కు పైగా, బుధవారం 200కు పైగా, గురువారం 500కు పైగా విమానాలను ఇండిగో రద్దు చేసింది. శుక్రవారం ఈ సంఖ్య ఏకంగా వెయ్యికి చేరింది. శనివారం కూడా దాదాపు 400 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
French Citizen stranded and crying in India amidst the IndiGo fiasco.
— Roshan Rai (@RoshanKrRaii) December 6, 2025
But sure, don’t blame the govt.
pic.twitter.com/Eo66FOJB1g
