ఐదు రోజులుగా ఇండిగో విమనాల రద్దుతో దేశంలో గందరగోళం.. ప్రయాణికులకు నానా అవస్థలు..ఎయిర్ పోర్టులో పడిగాపులు.. ఇండిగో విమానాలు తిరిగి ఎప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థకు అల్టీమేట్ జారీ చేసింది.. ప్రయాణికుల సమస్యలు తీర్చేందుకు డెడ్ లైన్ పెట్టింది.
24 గం టల్లో ప్రయాణికులకు పెండింగ్ లో టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని, 48 గంటల్లో లగేజీని వారి ఇంటికి డెలివరీ చేయాలని ఆదేశించింది. ఇండిగో సంక్షోభంతో దేశంలో పెరిగిన ధరలను అరికట్టేందుకు ఛార్జీల లిమిట్స్ ను విధించింది.
ఇండిగో సంక్షోభంతో ఐదురోజులుగా వందలాది విమానాలు రద్దయ్యాయి. దీంతో టికెట్ ధరలు పెరిగాయి. విమానాల రద్దు, ఆలస్యంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటువంటి సమయంలో ప్రయాణికులను ఆదుకునేందుకు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది.
ఇండిగో సంస్థకు పలు కీలక ఆదేశాలు ..
- ఆదివారం డిసెంబర్ 7 రాత్రి 8 గంటల లోపు విమానాల రద్దుతో పెండింగ్ లో ఉన్న ప్రయాణికుల వాపస్ ఇచ్చే టికెట్ డబ్బులు ఇవ్వాలని ఆదేశించింది. ప్రయాణికుల లగేజీని వారి ఇంటికి పంపించాలని సూచించింది.
- విమానాల రద్దు సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు రీషెడ్యూల్ పేరిట డబ్బులు వసూలు చేయొద్దని ఇండిగోతోపాటు ఇతర విమాన యాన సంస్థలకు అల్టీమేటం జారి చేసింది.
- 48 గంటల్లో ప్రయాణికుల లగేజీని వారి అడ్రస్ కనుక్కొని మరీ ఇళ్లకు చేర్చాలని కోరింది.
- విమానాల రద్దు సంక్షోభ సమయంలో టికెట్ ధరలు పెరుగుదలను అరికట్టేందుకు ప్రభావిత మార్గాల్లో ఛార్జీలపై పరిమితులను విధించింది. ఖచ్చితంగా పాటించాలని ఎయిర్ లైన్స్ సంస్థలకు తెలిపింది.
- యథావిధిగా విమానాలు కొనసాగే వరకు విమాన ఛార్జీలపై లి మిట్స్ అమలు లో ఉంటాయి. ఈ రూల్స్ అతిక్రమిస్తే నియంత్రణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
- 24 గంటల్లోపు విమానాల రాకపోకలు సాధారణ స్థితికి వస్తుంది.. మరో మూడు రోజుల్లో పూర్తి్ స్థాయిలో విమానాలు అందుబాటులో వస్తాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.
- ప్రయాణికులను అందుబాటులో ఉండేందుకు 24×7 కంట్రోల్ రూమ్ ను ప్రారంభించింది. 011-24610843, 011-24693963, 096503-91859 నంబర్లు అందుబాటులో ఉంచింది.
