మేం ఐరన్ మ్యాన్ కాదయ్యా : శాండ్ విచ్ లో నట్లు, బోల్టులు

మేం ఐరన్ మ్యాన్ కాదయ్యా : శాండ్ విచ్ లో నట్లు, బోల్టులు

ఎయిర్ లైన్స్ సంస్థలు రోజుకో చోట విమర్శలు ఎదుర్కుకుంటున్నానయి. ముఖ్యంగా ఇండిగో సంస్థ పై ప్రయాణికులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఫైర్ అవుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆహారంలో బొద్దింకలు లాంటివి కనిపించడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఓ ప్రయాణికుడికి నత్తలు వస్తే ఈసారి కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలని ఐరన్ నట్లు వచ్చాయి. ప్రయాణికురాలు ఆహారం తినలేక చేసేది లేక చెత్త కుప్ప పాలు చేయాల్సి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే జ్యోతి రౌతేలా అనే ప్రయాణికురాలు ఫిబ్రవరి 1న బెంగళూరు నుండి చెన్నైకి ఇండిగో ఫ్లైట్‌లో బయలుదేరింది. విమానంలోనే స్పినాచ్ కార్న్ చీజ్శాండ్‌విచ్‌ను ఆర్డర్‌ పెట్టుకుంది. ఆ శాండ్‌ విచ్‌ను తినడకుండా అలాగే జర్నీ చేస్తూ వచ్చింది. చెన్నై విమానశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత  తినడం ప్రరంభించింది. ఈ క్రమంలోనే కొంచెం తినగా ఒక్కసారిగా షాక్కు గురైంది. శాండ్‌విచ్‌లో నట్లు, బోల్ట్‌ ఉండడం చూసి కంగుతిన్నది.

Got a screw in my sandwich
byu/MacaroonIll3601 inbangalore

 సంబంధిత విభాగంపై చర్యలు తీసుకోవాలని ఇండిగో అధికారులకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ ద్వారా తెలిపింది. తన కంప్లైంట్ పై సంస్థ స్పందిస్తూ మీరు విమాన ప్రయాణంలో శాండ్‌ విచ్‌ తిని ఉంటే చర్యలు తీసుకోనే వాళ్లం. కానీ మీరు విమానం దిగిన తర్వాత శాండ్‌ విచ్‌లో బోల్ట్‌ ఉందని ఫిర్యాదు చేస్తే లాభం లేదంటూ సంస్థ రిప్లే ఇచ్చింది. ఈ రిప్లై కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయంపై నెటిజన్ల ఇండిగో తీరును విమర్శిస్తున్నారు. ప్రయాణికుల పట్ల ఇండిగో బాధ్యతా రహితంగా వ్యవహరించడం సరికాదని వెంటనే క్షమాపన చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: ఢిల్లీ ఫుల్ ట్రాఫిక్ జామ్​