ఇండిగో సంక్షోభం దాదాపు ఆరు రోజులపాటు విమానయాన రంగాన్ని గందరగోళానికి గురిచేసింది. ప్రయాణికులను రోజుల తరబడి ఎయిర్ పోర్టులలో అష్టకష్టాలు పడేలా చేసింది. ప్రభుత్వ చర్యలతో ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు పూనుకున్న ఇండిగో యాజమాన్యం.. దేశ వ్యాప్తంగా ఏర్పిడిన నెట్ వర్క్ అంతరాయాన్ని 95 శాతం పునరుద్ధరించినట్ల పేర్కొంది. అందులో భాగంగా ఆదివారం (డిసెంబర్ 07) 1500 ఫ్లైట్స్ నడపనున్నట్లు ప్రకటించింది.
నెట్‌వర్క్‌లో ఇటీవల ఏర్పడిన అంతరాయాలను పరిష్కరిస్తూ కొన్ని ఫ్లైట్లను రద్దు చేశామని, శనివారం 113 గమ్యస్థానాలను కలుపుతూ 700 కు పైగావిమానాలను నడిపామని ఇండిగో ప్రకటించింది. నెట్‌వర్క్, కనెక్టివిటీ వ్యవస్థలు సరిచేయడం, ప్రయాణికులకు ఆటంకం కలగకుండా చూడటమే తమ లక్ష్యమని తెలిపింది.అందులో భాగంగా అధిక సంఖ్యలో విమానాలు నడిపి తమపై ఉన్న విశ్వాసాన్ని నిలుపుకుంటామని పేర్కొంది.
ప్రభుత్వ వైఫల్యం:
ఇండిగో సంక్షోభంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా అన్ని వ్యవస్థలు విఫలమవుతున్నాయని విమర్శించారు. వైమానిక శాఖ, డీజీసీఏ మధ్య సమన్వయ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని అన్నారు. జనవరి-2024 లో ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ కు నోటీఫికేషన్ ఇస్తే ఇప్పటికీ అమలు చేయడంలేదంటే ఆ శాఖ మసన్వయం చేస్తుందో చెప్పవచ్చునని విమర్శించారు.
►ALSO READ | డీప్ ఫేక్ కట్టడిపై కేంద్రం ఫోకస్.. లోక్సభ ముందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లు
ఇండిగో అధికారులకు నోటీసులు:
ఇండిగో సంక్షోభంపై ఆగ్రహించిన కేంద్రం.. ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా మేనేజర్ ఇసిడ్రో పొర్కురస్ ను బాధ్యుడిగా చేస్తూ నోటీసులు ఇచ్చింది. 24 గంటలో నోటీసులపై స్పందించాలని ఆదేశించింది.
