
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి సంబురాలను మరో వారం రోజులపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 7న ప్రారంభమైన సంబురాలు శుక్రవారంతో ముగియనుండగా.. 24 వరకు కొనసాగించాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలు, జిల్లా మహిళా సమాఖ్యల విజ్ఞప్తి మేరకు సంబురాలను ప్రభుత్వం పొడిగించింది.
మంత్రులకు బిజీ షెడ్యూల్ ఉండటంతో కొన్ని నియోజకవర్గాల్లో ఇందిరా మహిళా శక్తి సంబురాలు పూర్తి కాలేదు. ప్రతి నియోజకవర్గంలో సంబురాలు నిర్వహించడంతోపాటు వడ్డీ మాఫీ చెక్కులు, ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కుల పంపిణీ, మహిళా సంఘాల వ్యాపారాలు, వారు కొను గోలు చేసిన బస్సులను ప్రారంభిస్తున్నారు.