వరంగల్, వెలుగు: ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను కోటీశ్వరులను చేసే క్రమంలో వారికి క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి తెలిపారు.
సోమవారం హనుమకొండ అంబేడ్కర్ భవన్‍లో జీడబ్ల్యూఎంసీ మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం 5,344 స్వయం సహాయక సంఘాల ద్వారా 58,784 మంది మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది మార్చి 31 నాటికి 1,072 సంఘాలకు రూ.121 కోట్ల 24 లక్షల రుణాలు అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్‍ఐఆర్ ప్రక్రియలో ఆర్‍పీలు, ఆశా కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నిర్వహించిన కార్యక్రమంలో 106 మంది లబ్ధిదారులకు రూ.కోటి 06 లక్షల 12 వేల 296 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.
