కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రగతిభవన్ నుంచి తరిమేస్తాం

కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రగతిభవన్ నుంచి తరిమేస్తాం

రాజకీయాల్లో విశ్వసనీయత చాలా ముఖ్యమని..తెలంగాణ లో విశ్వసనీయత అంటే జోక్ గా మారిందన్నారు షర్మిళ మద్దతురాలు ఇందిరా శోభన్. ఖమ్మంలో జరిగిన వైస్ షర్మిళ సంకల్ప సభలో మాట్లాడిన ఆమె.. సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఒక దగల్బాజీ అని..పొద్దున చెప్పేది సాయంత్రానికి ఉండదని విమర్శించారు. ప్రజలు అబద్దం వైపు ఉంటారా? నిజం వైపు ఉంటారో తేల్చుకోవాలని సూచించారు. అమరవీరుల కుటుంబాల గోస ఏనాడైనా పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు.

ప్రజల ఎజెండాగా వైఎస్ఆర్ పరిపాలన చేశారు కాబట్టే ఇంకా ఆయన ప్రజల హృదయాల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ కు ఆయన కుటుంబానికి ఉద్యోగాలు ఉంటే చాలని..తెలంగాణ బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వరని ఆరోపించారు.

మమత ఆస్పత్రి ఆస్తులను కాపాడుకునేందుకే పువ్వాడ అజయ్ పార్టీలు మారారని ఆరోపించారు ఇందిరా శోభన్. జాబ్ రావాలన్న, రైతులకు మంచి జరగాలన్నా, ఫీజు రియంబర్స్ మెంట్, అమరుల ఆశయాలు సహకారం కావాలంటే షర్మిళ రావాల్సిన అవసరం ఉందన్నారు. షర్మిళ ఒంటరిగా వచ్చారు.. అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. రాజన్న సంక్షేమ పాలన సహకారం కోసమే షర్మిళ వస్తున్నారని..కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రగతిభవన్ నుంచి తరిమేస్తా తేల్చిచెప్పారు.