కుంటాల మండలంలోని గ్రామ దేవతలకు బోనాలు

కుంటాల మండలంలోని గ్రామ దేవతలకు బోనాలు

కుంటాల, వెలుగు: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని విట్టపూర్ లో బోనాల పండుగ అట్టహాసంగా జరిగింది. గ్రామస్తులంతా గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. 

ఇటీవల గ్రామంలో ఆలయాలు నిర్మించి గ్రామ దేవతలను ప్రతిష్ఠించగా ఆదివారం మహిళలు డప్పు వాయుద్యాల మధ్య బోనాలతో ఊరేగింపుగా వెళ్లి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.