పాఫోస్ (సైప్రస్): ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలికి షాక్ తగిలింది. విమెన్స్ సెక్షన్‌లో టేబుల్ టాపర్‌గా ఉన్న వైశాలి ఆదివారం జరిగిన 12వ రౌండ్ గేమ్‌లో చైనా ప్లేయర్ జూ జిన్ జెన్ చేతిలో పరాజ యం పాలైంది. మరో మ్యాచ్‌లో దివ్య దేశ్‌ముఖ్.. చైనా జీఎం టాన్ జోంగీ చేతిలో ఓడిపోయింది. ఓపెన్ సెక్షన్‌లో ప్రజ్ఞానంద 12వ గేమ్‌లో రష్యాకు చెందిన ఆండ్రీ ఎసిపెంకోతో డ్రా చేసుకున్నాడు.
