జిమ్ చేస్తుండగా మెడ విరిగి బాడీ బిల్డర్ మృతి

జిమ్ చేస్తుండగా మెడ విరిగి బాడీ బిల్డర్ మృతి

ఇండోనేషియాకు చెందిన  33 ఏళ్ల ఫిట్‌నెస్  ట్రైనర్  జస్టిన్ విక్కీ కన్నుముశాడు.  తాను లిప్ట్ చేస్తున్న  వెయిట్ మెడ మీదప‌డ‌డంతో ప్రాణాలు కోల్పోయాడు. స్క్వాట్‌ప్రెస్ కోసం విక్కీ 210 కేజీల బ‌రువున్న బార్బెల్‌ను ఎత్తి త‌న భుజాల‌పై పెట్టుకున్నాడు. అయితే, అంత బ‌రువును కాయడంలో బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడ్డాడు. 

దీంతో బార్బెల్ అత‌డి మెడ‌పై ప‌డింది. దీంతో మెడ విరిగి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అత‌డి గుండె, కాలేయానికి సంబంధించిన న‌రాల వ్యవ‌స్థ దెబ్బతిన్నది.  వెంటనే విక్కీని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ అత్యవసర ఆపరేషన్ చేయించుకున్న కొద్దిసేపటికే అతడు మరణించాడు.  

2023 జూలై 15న ఈ సంఘటన జరగగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్  గా మారింది.  దీంతో విక్కీ అభిమానులు అతనికి సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.