ఇండోనేసియాలో భారీ భూకంపం.. సునామీ వచ్చే ఛాన్స్!

ఇండోనేసియాలో భారీ భూకంపం.. సునామీ వచ్చే ఛాన్స్!

ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సముద్రగర్భంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఫోర్స్ ఐలాండ్ లో ఈ భూకంపం సంభవించిందని.. సునామీ వచ్చే ఛాన్సులు ఉన్నాయని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రానికి 18.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. మౌమెరే పట్టణానికి 112 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. కాగా, ఇండోనేసియాలో చివరగా 2004లో సునామీ వచ్చింది. ఆ ఏడాది డిసెంబర్ 26న ఈశాన్య సుమత్రా దీవుల్లో సంభవించిన సునామీలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఏడాది సంభవించిన సునామీ దెబ్బకు ఇండోనేసియా, భారత్, శ్రీలంకతోపాటు మరో తొమ్మిది దేశాల్లో కలిపి సుమారు 2.30 లక్షలకు పైగా ప్రజలు చనిపోయారు.