ఇండోనేషియాలో బద్దలైన మెరాపి అగ్నిపర్వతం

ఇండోనేషియాలో బద్దలైన మెరాపి అగ్నిపర్వతం

ఇండోనేసియాలోని జావా ద్వీపంలో ఉన్న మెరాపి అగ్నిపర్వతం బద్దలైంది. పరిసర ప్రాంతాల్లో పొగతో కూడిన మేఘాలు అలముకున్నాయి. దీంతో  ఆ ప్రాంతంలో పర్యాటకం, మైనింగ్ కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు. పొగ మేఘాల ధాటికి దాదాపు 7కి.మీ. వరకు సూర్య రశ్మి లేక చీకటి అలముకుందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. అగ్నిపర్వతం నుంచి 1.5కి.మీ. వరకు లావా ప్రవహించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఏడు కిమీ. పరిధిలో ప్రమాదకర వాతావరణం నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఇండోనేసియాలో ఉన్న క్రియాశీలక అగ్నిపర్వతాల్లో ఇదొకటని యోగ్యకర్త విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హానిక్ హుమైదా తెలిపారు. 2010లో ఇదే మెరాపి అగ్నిప్రమాదం బద్దలై 347 మంది మరణించారు.