వీడియో వైరల్‌: అధికారులను ఇంగ్లీష్‌లో కడిగేసిన కూరగాయల వ్యాపారి

వీడియో వైరల్‌: అధికారులను ఇంగ్లీష్‌లో కడిగేసిన కూరగాయల వ్యాపారి

ఇండోర్‌‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌‌లో కూరగాయాలు అమ్మే రైసా అన్సారీ అనే మహిళ అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తోపుడు బండిలో కూరగాయలు అమ్మే ఆ మహిళ మున్సిపల్‌ అధికారులను ఇంగ్లీష్‌లో కడిగేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మున్సిపల్‌ అధికారులు కూరగాయలు అమ్మే తోపుడు బండ్లను తొలగిస్తుండటంతో ఆమె వారితో ఇంగ్లీష్‌లో వాదించారు. లాక్‌డౌన్‌ వల్ల కూరగాయల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని, ఫ్యామిలీలను ఎలా బతికించుకోవాలని ఆమె ప్రశ్నించారు. తను ఇండోర్‌‌లోని దేవి అహల్యా యూనివర్సిటీలో మెటీరియల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసినట్లు చెప్పింది. ముస్లింల వల్లే కరోనా వ్యాప్తి చెందింది అనే అపోహ చాలా మందిలో ఉందని, అందుకే తనకు ఎవరూ ఉద్యోగం ఇవ్వడం లేదని ఆమె చెప్పింది. ఇక్కడ దాదాపు 20 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. కాగా.. అన్సారీ అధికారులను ఇంగ్లీష్‌లో ప్రశ్నలు అడిగిన వీడియోను జర్నలిస్టులు సోషల్‌ మీడియాలో పెట్టడంతో అది నెటింట్లో వైరల్‌ అయింది.