శత్రు డ్రోన్ల పనిపడతది..!సరిహద్దు రక్షణ కవచంగా ‘ఇంద్రజాల్’

శత్రు డ్రోన్ల పనిపడతది..!సరిహద్దు రక్షణ కవచంగా ‘ఇంద్రజాల్’
  • దేశంలో మొట్టమొదటి యాంటీ డ్రోన్​ గస్తీ వెహికల్​ లాంచ్​

గచ్చిబౌలి, వెలుగు: దేశంలో మొట్టమొదటి యాంటీ డ్రోన్​ పెట్రోలింగ్ వెహికల్​ను ఇంద్రజాల్​డ్రోన్​డిఫెన్స్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. బుధవారం రాయదుర్గంలోని టీ హబ్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘ఇంద్రజాల్​ రేంజర్’ పేరుతో ఈ వెహికల్​ను లాంచ్​ చేశారు.

 కార్యక్రమానికి రిటైర్డ్ లెఫ్టినెంట్​జనరల్ దేవేంద్ర ప్రతాజ్​పాండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భద్రత విషయంలో ఇది కీలక పరిణామమన్నారు. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం ఆయుధాలతో మాత్రమే ఉండవని, ప్రస్తుతం డ్రోన్స్​పాత్ర ప్రమాదకరంగా మారిందన్నారు. 

ఇటీవల పాకిస్థాన్​భారత్​పైకి పంపిన డోన్లను సైన్యం నిర్వీర్యం చేసిందని గుర్తుచేశారు. ఇంద్రజాల్​రేంజల్​వెహికల్ కదులుతూనే డ్రోన్లను గుర్తించి కూల్చివేయడం, అనుమానాస్పద డ్రోన్లను కూల్చడం చేస్తుందన్నారు. సరిహద్దుల్లో అక్రమ డ్రోన్ నెట్​వర్క్​లను ఎదుర్కొనే ఈ యాంటీ- డ్రోన్ వెహికల్ యంత్రం కాదని, ఇది మన పిల్లలు, రైతులు, సరిహద్దు ప్రజలకు రక్షణ కవచంగా అభివర్ణించారు.

  ముంబైలోని తాజ్​ హోటల్​పై 26/11 దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించేందుకే సరిగ్గా అదే రోజున ఈ వెహికల్​ను లాంచ్​ చేస్తున్నట్లు సంస్థ సీఈఓ కిరణ్​రాజు తెలిపారు. ఈ యాంటీ డ్రోన్​వెహికల్​10 కిలోమీటర్ల పరిధి వరకు పనిచేస్తుందని, సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ దళాలపై పని భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు.