
అంగవైకల్యం మనిషికే కానీ మనసుకు కాదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో దివ్యంగులకు 19 ద్విచక్ర వాహనాలు, 14 బ్యాటరీ వీల్ చైర్స్, 4 ల్యాప్ టాప్స్, 4జీ స్మార్ట్ ఫోన్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు.
ప్రతి ఒక్కరూ దివ్యాంగులను ఆదరించాలని, వారిని కించపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వంలో అర్హులైన దివ్యాంగులందరికీ 3016 రూపాయల పెన్షన్ ను ఇచ్చి.. వారికి ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో డ్యాన్స్ తో అలరించిన సందీప్ అనే దివ్యాంగుడిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.