ఇంద్రకీలాద్రిలో కళ్లముందే విరిగిపడిన కొండరాళ్లు

ఇంద్రకీలాద్రిలో కళ్లముందే విరిగిపడిన కొండరాళ్లు

భారీ వర్షాలు లేదా భూకంపాలు సంభవించినప్పుడు కొండరాళ్లు విరిగి పడడం మనం చూస్తుంటాం. అలాంటిదేమీ లేకుండానే ఇంద్రకీలాద్రిలో కొండరాళ్లు విరిగి పడ్డాయి. ఈ ఘటన విజయవాడ కనక దుర్గ ఆలయంలో కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడికి వెళ్లే ఘాట్‌రోడ్డుపై కొండచరియలు విరిగిపడటంతో గుడికి వచ్చిన భక్తులంతా ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. కొండరాళ్లు కూలి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి పడింది. ఈ ఘటనను ఓ ప్రత్యక్ష సాక్షి తన కెమెరాలో బంధించాడు. తొలుత కొద్దిగా మట్టి, రాళ్లు పడ్డాయని.. మరికొద్ది క్షణాల్లోనే కొండపై ఉన్న పెద్ద భాగం రోడ్డుపై కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. కొండరాళ్లు పడకుండా అధికారులు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా ఫలితం లేకుండా పోయింది. 

Also Read : హెల్త్ అలర్ట్ : హైదరాబాద్ సిటీలో 10 రేట్లు పెరిగిన డెంగ్యూ కేసులు

అనంతరం అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. ఇలాంటి ఘటన పునరావృతం కావచ్చని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.  భారీ బండరాళ్లు రోడ్డుపై పడడంతో ట్రాఫిక్‌ జాం అయింది.