INDvs AUS ODI : రాణించిన రాహుల్, జడేజా..భారత్ గ్రాండ్ విక్టరీ

INDvs AUS ODI : రాణించిన రాహుల్, జడేజా..భారత్ గ్రాండ్ విక్టరీ

ఆసీస్ తో జరిగిన ఫస్ట్ వన్డేలో  భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. 189 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.   కేఎల్ రాహుల్, జడేజా అద్భుతమైన ఆటతీరుతో  భారత్ ను గెలిపించారు. టాప్ ఆర్డర్ ఇషాన్ కిషన్ 3, శుభ్ మన్ గిల్ 20, విరాట్ కోహ్లీ 4, సూర్యకుమార్ యాదవ్  డకౌట్ తో అట్టర్ ప్లాప్ అయినా రాహుల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడిండు. ఆపద్భాందవుడిలా   75 పరుగుల (నాటౌట్) తో  చెలరేగి  మ్యాచ్ ను గెలిపించాడు. రాహుల్ కు తోడుగా రవీంద్రా జడేజా 45 పరుగులు(నాటౌట్) చేయడంతో భారత్ 39.5 ఓవర్లలోనే మ్యాచ్ ను ఫినిష్ చేసింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్  3, మెర్క్యూస్ స్టోనిస్ 2 వికెట్లు తీశారు.

కేఎల్ రాహుల్ ఫామ్ పై కొన్ని రోజులుగా  విమర్శలు వస్తున్నాయి. రాహుల్ కు ఇంకా ఎన్ని సార్లు చాన్స్ ఇస్తారంటూ  సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.అయితే ఇవాళ్టి ఇన్నింగ్స్ తో రాహుల్అందరినీ ఆకట్టుకున్నాడు. భారత టాపర్డర్ వెనువెంటనే పెవిలియన్ చేరినా రాహుల్ కాన్ఫిడెంట్ గా ఆడిండు. నెమ్మదిగా  ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 188 పరుగులకే కుప్పకూలింది. మార్ష్ 81 పరుగులు మినహా మిగతా వారెవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో  షమీ3, సిరాజ్ 3, జడేజా2 , హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో ఒక వికెట్ తీశారు.