- ఇన్ఫ్ల్యుయెన్సర్, వ్యాపారవేత్త శిల్పారెడ్డి
హైదరాబాద్, వెలుగు : ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం అకాన్ రెస్టో బార్, ఎక్స్ట్రా మైల్ సంయుక్తంగా బంతి భోజన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మిసెస్ఇండియా(2004), ఇన్ఫ్ల్యుయెన్సర్, వ్యాపారవేత్త శిల్పారెడ్డి అన్నారు. ఇండిపెండెన్స్డే సందర్భంగా సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో శిల్పారెడ్డి పాల్గొని మాట్లాడారు. సమాజానికి తమ వంతు సాయం అందించడం గొప్ప విషయమన్నారు.
వినూత్న రీతిలో బంతి భోజనాలు ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అన్నారు. దీని ద్వారా వచ్చిన డబ్బును ప్రీమెచ్యూర్బేబీస్ ఆరోగ్యం కోసం ఉపయోగించడం మంచి కాన్సెప్ట్ అన్నారు. శిల్పారెడ్డితోపాటు, ‘వీరాంజనేయులు విహార యాత్ర’ నటీనటులు రాగ్ మయూర్, ప్రియా వడ్లమణి, ఎక్స్ట్రా మైల్ సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ నితీష, అకాన్ రెస్టో బార్ నిర్వాహకులు జి. నాగేశ్వర్ రెడ్డి, జి.నీహాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
