
ఆమె టాలెంట్ అద్భుతం..ఆమె వేదికలు అవసరం లేదు.. జనం తిరుగుతుండే ప్రదేశాలే ఆమె డయాస్.. నెటిజన్లే ఆమె ప్రేక్షకులు.. రీల్స్ చేస్తున్నపుడు పిచ్చిగా అనిపించినా.. నెట్టింట ఆమె ప్రతిభను మెచ్చుకునేవారు అనేకం.. ఓ యూట్యూబ్ ఇన్ ఫ్లుయెన్సర్.. గౌహతి రోడ్లపై మంజులిక క్యారెక్టర్, డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఆమెను మెచ్చుకోకతప్పదు.. మంజులిక క్యారెక్టర్ అంటే ఇటీవల కాలంలో వచ్చిన చంద్రముఖి సినిమాలోని చంద్రముఖి క్యారెక్టర్ లాంటిది. ఫిల్మీ రిక్రియేషన్‌కు సంబంధించిన ఈ యూట్యూబర్ వీడియో వైరల్‌గా మారింది. ఆమె పెర్ఫార్మెన్స్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. 40 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే.. ఆమె యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పనక్కర్లేదు.
ఆకుపచ్చ, ఎరుపు రంగు చీర ధరించి.. ఫేమస్ య్యూట్యూబర్ ప్రీతి థాపే భీకరమైన రూపాన్ని ప్రదర్శిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆకర్షణీయమైన వస్త్రధారణ, నటనా స్కిల్స్ తో క్యారెక్టర్ ను అద్బుతంగా ప్రదర్శించింది. 2007 లో వచ్చిన సినిమాలోని 'అమీ జే తోమర్ పాటకు ఆమె టాలెంట్ ను చూపించింది. గౌహతి వీధుల్లో ఆమె నృత్యం చేస్తున్నప్పుడు అచ్చు గుద్దినట్లు.. ఇటీవల వచ్చిన చంద్రముఖి సినిమాలో జ్యోతిక .. చంద్రముఖి క్యారెక్టర్ ను గుర్తుకు చేసింది. ఆమె ముఖ కవళికల నుంచి ఆమె నృత్య కదలికల వరకు ఆమె ప్రదర్శించిన 'మంజులిక ఇన్ గౌహాతి' ప్రదర్శనతో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.
ఈ వీడియో మేలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడినప్పటికీ ఇది ఇప్పటికీ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా సైట్‌లో దీనికి 40.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. వైరల్ వీడియో కూడా లక్షకు పైగా లైక్‌లను ఆకర్షించింది. నెటిజన్లు థాపా నృత్య ప్రదర్శనను తెగ మెచ్చుకుంటున్నారు.