లవ్ ఫెయిల్యూర్.. యువకుడు సూసైడ్.. ఇన్ఫోసిస్ లో ఐటీ ఉద్యోగి.. కారణం ఇదే..!

లవ్ ఫెయిల్యూర్.. యువకుడు సూసైడ్.. ఇన్ఫోసిస్ లో ఐటీ ఉద్యోగి.. కారణం ఇదే..!

ఘట్​కేసర్, వెలుగు: ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురైన ఓ ఐటీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోచారం ఐటీ కారిడార్​ సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని గుంటూరు జిల్లా సంగడిగుట్టకు చెందిన కుర్ర శ్రీనివాస్​రెడ్డి కొడుకు పవన్  కల్యాణ్ రెడ్డి(26) సింగపూర్​ టౌన్​షిప్​లో ఫ్రెండ్స్​తో కలిసి అద్దెకుంటూ ఇన్ఫోసిస్​లో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల లవ్​ ఫెయిల్యూర్​ కావడంతో సోమవారం రాత్రి బెబ్​షీట్​తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.