IT News: టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ బిగ్‌డీల్.. కొత్తగా ఆ కంపెనీ కొనుగోలు..

IT News: టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ బిగ్‌డీల్.. కొత్తగా ఆ కంపెనీ కొనుగోలు..

Infosys News: దేశీయంగా టెక్ కంపెనీలు ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ వ్యాపార అస్థిరతల్లో ముందుకు వెళ్లేందుకు ఉన్న ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి కంపెనీలు కొత్త నియామకాలు భారీగా చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా కొనసాగుతున్న ఇన్ఫోసిస్ సైబర్ సెక్యూరిటీ వ్యాపారంపై ఫోకస్ పెంచింది. వ్యూహాత్మక విస్తరణలో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థ ది మిస్సింగ్ లింక్ ను 532 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని వెల్లడైంది. అయితే దీనిని పూర్తిగా డబ్బు చెల్లింపు రూపంలో పూర్తి చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇన్ఫోసిస్ సింగపూర్ సంస్థ ఈ డీల్ చేపట్టిందని తేలింది.

ఈ చర్యలతో కంపెనీ సైబర్ సెక్యూరిటీస్ వ్యాపారం ఆస్ట్రేలియాలో మరింత విస్తరించేందుకు అవకాశం లభించనుందని తేలింది. తాజా డీల్ వల్ల సైబర్ సెక్యూరిటీలో స్కిల్ కలిగిన ఉద్యోగులను ఇన్ఫోసిస్ చేజిక్కించుకుంది. ఇది తమ గ్లోబల్ సైబర్ డిఫెన్స్ సెంటర్లను మరింత బలోపేతం చేస్తుందని టెక్ దిగ్గజం పేర్కొంది.

Also Read:-ఏపీ టెక్​పార్కులో క్వాంటం కంప్యూటర్​

 వాస్తవానికి ది మిస్సింగ్ లింక్ సంస్థ తన క్లయింట్లకు ఐటీ వ్యూహాలు, టెక్నాలజీ రోడ్ మ్యాప్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, రిస్క్ అసెస్మెంట్, రిస్క్ మిటిగేషన్, ఆటోమేషన్ వంటి సేవలను అందిస్తోంది. ప్రస్తుతం దీనిని ఇన్ఫోసిస్ కొనుగోలు ద్వారా డిఫెన్సివ్ అండ్ అఫెన్సివ్ సెక్యూరిటీ సర్వీసెస్, సైబర్ సెక్టూరిటీలో టాక్టికల్ సపోర్ట్ వంటి సేవలను మరిన్ని క్లయింట్లకు విస్తరించాలని భారతీయ టెక్ దిగ్గజం భావిస్తోంది.