హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తొడ కండరాల గాయానికి గురైన సీఎస్కే యంగ్ బ్యాటర్ ఆయుష్ మాత్రే మూడు వారాల పాటు ఆటకు దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. తన గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ‘రాబోయే రెండు రోజుల్లో మాత్రేకు స్కానింగ్ చేస్తారు. ఆ తర్వాతే గాయంపై స్పష్టత వస్తుంది. మంచి ఫామ్‌లో ఉన్న మాత్రే సేవలను కోల్పోవడం మా జట్టుకు పెద్ద లోటే’ అని సీఎస్కే బ్యాటింగ్ మైక్ హస్సీ పేర్కొన్నాడు.

